India: తీవ్ర ఒత్తిడిలో కుల్ భూషణ్ జాదవ్... పాక్ కుట్రలను వెల్లడించిన డిప్యూటీ హైకమిషనర్!

షార్ట్స్‌లో చూడండి
పాకిస్థాన్ కుటిల యత్నాలు మరోసారి వెల్లడయ్యాయి. గూఢచర్యం ఆరోపణలపై నిర్బంధంలోకి తీసుకున్న కుల్ భూషణ్ జాదవ్ పై పాక్ తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చినట్టు భారత డిప్యూటీ హైకమిషనర్ ను ఉటంకిస్తూ భారత విదేశాంగ శాఖ పేర్కొంది. తాను రా ఏజెంట్ నని కుల్ భూషణ్ తో బలవంతంగా ఒప్పించిన పాక్ ఆ మేరకు అతడి వాంగ్మూలాన్ని కొన్ని వీడియోల రూపంలో చిత్రీకరించింది.

ఇప్పటికీ తనపై అదే రీతిలో పాక్ ఒత్తిడి చేస్తోందని కుల్ భూషణ్ ఇవాళ తనను కలిసిన భారత డిప్యూటీ హైకమిషనర్ గౌరవ్ అహ్లూవాలియాతో చెప్పినట్టు తెలిసింది. ఆహ్లూవాలియాను కలిసిన సందర్భంగా జాదవ్ తీవ్ర ఒత్తిడిలో కనిపించాడని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు. దాదాపు రెండు గంటల పాటు అహ్లూవాలియాతో మాట్లాడిన కుల్ భూషణ్ కీలక వివరాలు వెల్లడించినట్టు సమాచారం.
Go Back to Shorts
India
Pakistan
Kulbhushan Jhadav

More Telugu News