మళ్లీ విధుల్లోకి చేరిన అభినందన్.. ఐఏఎఫ్ చీఫ్ ధనోవాతో కలిసి మిగ్-21లో చక్కర్లు!
- పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో విహారం
- 30 నిమిషాలు విహరించిన అభినందన్, ధనోవా
- అభినందన్ తండ్రితో కలసి పనిచేశానన్న ఐఏఎఫ్ చీఫ్
ఈ ఏడాది ఫిబ్రవరి 26న పాక్ లోని బాలాకోట్ లో ఉన్న జైషే ఉగ్రస్థావరంపై భారత విమానాలు బాంబుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. దీంతో పాకిస్థాన్ కు చెందిన అత్యాధునిక ఎఫ్-16 యుద్ధవిమానాలు దూసుకురాగా, అభినందన్ ఓ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చేశారు. ఈ క్రమంలో అభినందన్ నడుపుతున్న మిగ్-21 విమానం దెబ్బతినడంతో పాక్ సైన్యానికి దొరికిపోయారు. అయితే భారత్ అంతర్జాతీయంగా తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడంతో అభినందన్ ను పాక్ సురక్షితంగా విడిచిపెట్టింది.