Bigg Boss: బిగ్ బాస్ కు నాగార్జున దూరం... నేడు నో ఎలిమినేషన్!

షార్ట్స్‌లో చూడండి
తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకునేందుకు విదేశాలకు వెళ్లిన నాగార్జున, ఈ వారం బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్స్ కు దూరం కాగా, కార్యక్రమాన్ని నడిపించే బాధ్యతను రమ్యకృష్ణ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వారంలో పునర్నవి, హిమజ, మహేశ్ ఎలిమినేషన్ లో నామినేట్ అయ్యారన్న సంగతి తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో వస్తున్న ట్రెండ్స్ ప్రకారం, నాగ్ గైర్హాజరీలో ఈ వారం ఎలిమినేషన్ ఎపిసోడ్ ఉండదని తెలుస్తోంది. ఈ వారానికి ఎలిమినేషన్ ఉండదని, రమ్యకృష్ణ ద్వారా చెప్పిస్తూ, ఇప్పటికే నేడు ప్రసారం కావాల్సిన ఎపిసోడ్ ను చిత్రీకరించినట్టు సమాచారం. ఇక అసలు విషయం తెలియాలంటే, నేటి రాత్రి వరకూ ఆగక తప్పదు.
Go Back to Shorts
Bigg Boss
Ramyakrishna

More Telugu News