Telangana: తెలంగాణ గవర్నర్‌గా కేరళ గవర్నర్ సదాశివం?
- పదేళ్లుగా గవర్నర్‌గా కొనసాగుతున్న నరసింహన్
- నేడు విడుదల కానున్న ఉత్తర్వులు
- నరసింహన్‌ను ఎక్కడి పంపనున్నారన్నది సందిగ్ధం
తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మార్పు వార్తలు మరోమారు హల్‌చల్ చేస్తున్నాయి. తొలుత తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా నియామకమైన నరసింహన్ ప్రస్తుతం తెలంగాణ గవర్నర్‌గా ఉన్నారు. ఇప్పుడాయన స్థానంలో కేరళ గవర్నర్ సదాశివంను నియమించే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు నేడు విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.
దాదాపు పదేళ్లగా గవర్నర్‌గా కొనసాగుతున్న నరసింహన్.. ఇటీవల జమ్ముకశ్మీర్‌కు గవర్నర్‌గా వెళ్తారన్న ప్రచారం కూడా జరిగింది. తాజాగా, ఇప్పుడు మరోమారు ఆయన మార్పుకు సంబంధించిన వార్తల ప్రచారం జోరందుకుంది. ప్రస్తుతం కేరళ గవర్నర్‌గా ఉన్న సదాశివంను తెలంగాణ గవర్నర్‌గా నియమిస్తారన్న ప్రచారం జరుగుతున్నా.. నరసింహన్‌ను ఎక్కడికి పంపించనున్నారన్నది మాత్రం తెలియరాలేదు.