Yanamala: తొలి ఏడాదే వైసీపీ ప్రభుత్వం సింగిల్ డిజిట్ కు దిగజార్చింది: యనమల

షార్ట్స్‌లో చూడండి
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఏపీ మాజీ ఆర్థిక మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. వైసీపీ నిర్వాకాలే రాష్ట్ర ఆర్థిక పతనానికి కారణం అంటూ ఆరోపించారు. ఇష్టంవచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటూ ఆర్థిక పరిస్థితి దిగజార్చారంటూ మండిపడ్డారు. ఏపీలో ఆర్థిక కార్యకలాపాలన్నీ పూర్తిగా పడిపోయాయని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం వరుసగా నాలుగేళ్ల పాటు రెండంకెల వృద్ధి నమోదు చేస్తే, వైసీపీ సర్కారు తొలి ఏడాదే సింగిల్ డిజిట్ కు ఆర్థిక పరిస్థితిని దిగజార్చిందని విమర్శించారు. కోర్టు తీర్పులు, కేంద్రం హెచ్చరికలు విస్మరిస్తే ఏపీ అంధకారమేనని హెచ్చరించారు. ఏపీని డీప్ డిప్రెషన్ లోకి వైసీపీ ప్రభుత్వం నెట్టిందని ఆరోపించారు.
Go Back to Shorts
Yanamala
Andhra Pradesh
YSRCP

More Telugu News