నేనేమీ అత్యాచారం లాంటి నేరానికి పాల్పడలేదు.. ఎవరూ టెన్షన్ పడొద్దు: డీకే శివకుమార్
- మనీలాండరింగ్ కేసులో నిన్న రాత్రి శివకుమార్ కు ఈడీ సమన్లు
- ఈ మధ్యాహ్నం విచారణకు హాజరుకానున్న శివకుమార్
- విచారణకు పూర్తిగా సహకరిస్తానని వ్యాఖ్య
ఈ సందర్భంగా ఈ ఉదయం బెంగళూరులో మీడియాతో ఆయన మాట్లాడుతూ, 'నేను టెన్షన్ పడడం లేదు. ఎవరూ టెన్షన్ పడొద్దు. నేను ఏ తప్పూ చేయలేదు. అత్యాచారం వంటి నేరం కానీ, ఎవరి వద్ద నుంచైనా డబ్బు తీసుకోవడం కానీ చేయలేదు. నాకు వ్యతిరేకంగా ఏమీ లేదు' అన్నారు.
మరోవైపు, ఈ ఉదయం ట్విట్టర్ ద్వారా కూడా ఆయన స్పందించారు. 'నిన్న రాత్రి 9.40 గంటలకు ఈడీ సమన్లను అందుకున్నా. ఢిల్లీలో ఈ మధ్యాహ్నం ఒంటి గంటకు విచారణకు హాజరుకావాలని అందులో ఉంది. విచారణకు హాజరుకావాలంటూ హఠాత్తుగా సమన్లు ఇవ్వడం సరైన చర్య కాకపోయినా... చట్టంపై ఉన్న గౌరవంతో నేను విచారణకు హాజరవుతాను. విచారణకు పూర్తిగా సహకరిస్తా' అని తెలిపారు.