Chiranjeevi: 'సైరా' విడుదల తేదీ వాయిదాపడే అవకాశం?

షార్ట్స్‌లో చూడండి
చిరంజీవి కెరియర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో 'సైరా' చిత్రం నిర్మితమవుతోంది. ఇది ఒక స్వాతంత్య్ర పోరాట యోధుడి కథ కావడంతో, తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. గాంధీ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 2వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ ఉద్దేశంతోనే ప్రమోషన్ కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు.

అయితే అక్టోబర్ 2వ తేదీన హిందీలో 'వార్' సినిమా భారీస్థాయిలో విడుదలవుతోంది. హృతిక్ రోషన్ .. టైగర్ ష్రాఫ్ కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమా కారణంగా అక్కడ 'సైరా'కి ఆశించిన స్థాయిలో థియేటర్స్ దొరకడం లేదట. అందువలన ఒక వారం రోజుల పాటు 'సైరా' విడుదల వాయిదా వేయడం మంచిదని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు చరణ్ ను కోరినట్టుగా సమాచారం. దసరా సెలవులు కూడా కలిసొస్తాయనే ఉద్దేశంతో, అక్టోబర్ 8వ తేదీన 'సైరా'ను విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించవలసి వుంది.
Go Back to Shorts
Chiranjeevi
Nayanatara

More Telugu News