భారత భూభాగంలోని సైనికులు, ప్రజలను తికమక పెట్టేందుకు పాక్ కొత్త ఎత్తుగడ!
- ఎల్ ఓసీ వెంబడి ఎఫ్ ఎం రేడియో స్టేషన్ల ఏర్పాటు
- ఉగ్రవాదులను భారత్ లో ప్రవేశపెట్టేందుకు నయా పన్నాగం
- పాక్ కమాండర్లకు రేడియో స్టేషన్ల ఏర్పాటు బాధ్యతల అప్పగింత
ఉగ్రవాదులను భారత్ లో ప్రవేశపెట్టడంలో ఈ మధ్య పాక్ దళాలకు గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. దాంతో ఈ ఎఫ్ ఎం రేడియో స్టేషన్ల ఎత్తుగడకు పాక్ తెరదీసింది. ఎల్ ఓసీ వెంబడి ఎఫ్ ఎం రేడియో స్టేషన్లు ఏర్పాటు చేసే బాధ్యతను పాక్ మిలిటరీ కమాండర్లకు అప్పగించారు. అంతేకాకుండా, పీఓకేలో ఉన్న రేడియో స్టేషన్లను కూడా సరిహద్దు వెంబడికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.