అనుష్కపై చిరుకోపం ప్రదర్శించిన ప్రభాస్!
- అనుష్క అందంపై వ్యాఖ్యలు
- ఫోన్ చేస్తే వెంటనే లిఫ్ట్ చేయదంటూ ఫిర్యాదు
- కాజల్ డ్రెస్సింగ్ స్టయిల్ బాగుంటుందంటూ కితాబు
అనుష్క ఎంతో అందంగా ఉంటుందని, ఆకట్టుకునే రీతిలో నిండైన రూపాన్ని కలిగివుంటుందని చెప్పాడు. అయితే, ఎప్పుడు ఫోన్ చేసినా వెంటనే లిఫ్ట్ చేయదని చిరుకోపం ప్రదర్శించాడు. అనుష్కపై మీ అభిప్రాయం ఏంటని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ప్రభాస్ పైవిధంగా సమాధానమిచ్చాడు. ఇక, కాజల్ గురించి మాట్లాడుతూ, ఆమె ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుందని తెలిపాడు. డ్రెస్ సెన్స్ ఉన్న వ్యక్తి అని కితాబిచ్చాడు.