'బాహుబలి 2'లో అలా అవకాశం వచ్చింది: ఆశ్రిత వేముగంటి
చిన్నప్పటి నుంచి విశ్వనాథ్ గారి సినిమాలు ఎక్కువగా చూసేదానిని. అలాంటి నాకు ఆయన 'విశ్వనాథామృతం' కార్యక్రమానికి యాంకర్ గా చేసే అవకాశం రావడాన్ని అదృష్టంగా భావించాను. 'అంతకుముందు ఆ తరువాత' అనే సినిమా ఆడియో వేడుకలో స్టేజ్ పై నాట్య ప్రదర్శన ఇచ్చాను. అక్కడే రాజమౌళి గారు నన్ను చూశారు. ఆ తరువాత ఒక నెలకి ఆయన నుంచి నాకు కబురు వచ్చింది. 'బాహుబలి 2'లో 'కన్నా నిదురించరా' అనే పాటలో చేసే అవకాశం అలా వచ్చింది" అని ఆమె చెప్పుకొచ్చారు.