KTR: కేటీఆర్ ను తిట్టినందుకు అధికారి సస్పెన్షన్... మానవత్వం చూపిన కేటీఆర్!

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా, నల్లగొండ జిల్లా చండూరు ఎంపీడీవో సీహెచ్ నరేందర్‌ పై అధికారులు సస్పెన్షన్‌ వేటు వేయగా, కేటీఆర్ మానవత్వం చూపారు. కేటీఆర్ ను తిడుతున్న నరేందర్ వాయిస్ రికార్డ్ వైరల్ కాగా, అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. దీనిపై కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ విచారణకు ఆదేశించి, నరేందర్ ను సస్పెండ్ చేస్తున్నట్టు వెల్లడించారు. ఆపై కొందరు ఇతర ఎంపీడీఓలు అసలు విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి, విషయాన్ని వివరించారు. నరేందర్‌ తొందర పాటులో అలా మాట్లాడి ఉండవచ్చని, ఉన్నతాధికారులతో తాను మాట్లాడి సస్పెన్షన్‌ ఎత్తివేయించేందుకు ప్రయత్నిస్తానని కేటీఆర్‌ హామీ ఇచ్చారు.
Go Back to Shorts
KTR
MPDO
Suspend
Narender

More Telugu News