Kodela: గుంటూరు 'గౌతమ్ హీరో షోరూం'లో శాసనసభ ఫర్నిచర్.. అసెంబ్లీకి తరలించిన అధికారులు!

షార్ట్స్‌లో చూడండి
ఏపీ అసెంబ్లీకి సంబంధించిన ఫర్నిచర్ ను మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తన వద్ద ఉంచుకోవడం వివాదాస్పదమవడం తెలిసిందే. కొంత ఫర్నిచర్ కోడెల తనయుడికి చెందిన షోరూంలో దర్శనమివ్వడం ఆశ్చర్యం కలిగించింది. ఈ నేపథ్యంలో గుంటూరులోని గౌతమ్ హీరో షోరూం నుంచి ఫర్నిచర్ ను శాసనసభకు తరలించారు. అసెంబ్లీ సహాయ కార్యదర్శి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ఫర్నిచర్ తరలింపు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ తరలింపు ప్రక్రియలో అసెంబ్లీ సిబ్బందితో పాటు రెవెన్యూ, పోలీసు సిబ్బంది కూడా పాలుపంచుకున్నారు. కాగా,ఈ ఫర్నిచర్ విలువ రూ.65 లక్షల పైనే ఉంటుందని మీడియాలో కథనాలు వచ్చాయి.
Go Back to Shorts
Kodela
Furniture
Assembly

More Telugu News