Kodela: కోడెలపై ఐపీసీ 409 కింద కేసు నమోదు!

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫర్నిచర్‌ ను సొంతానికి వాడుకున్నందుకు ఐపీసీ సెక్షన్ 409 కింద మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పై కేసు నమోదైంది. ఆయన కుమారుడు శివరామ్ పై సెక్షన్ 414 కింద కేసును రిజిస్టర్ చేసినట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అసెంబ్లీ సెక్షన్‌ ఆఫీసర్‌ ఈశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఫర్నీచర్ ను తన కార్యాలయానికి, తన కుమారుడు శివరామ్ నిర్వహిస్తున్న షోరూమ్ కు తరలించారని కోడెలపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు తనిఖీలు చేపట్టిన అధికారులు, గుంటూరులోని గౌతమ్‌ హీరో షోరూమ్‌ లో అసెంబ్లీ ఫర్నిచర్‌ ఉందని గుర్తించారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వగా, వారి ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు.
Go Back to Shorts
Kodela
Assembly
Furniture

More Telugu News