అరుణ్ జైట్లీ మరణం దేశానికి తీరని లోటు!: తెలంగాణ సీఎం కేసీఆర్
- ఆర్థికమంత్రిగా జైట్లీ సేవలు మరువలేనివి
- ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా
- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్య
జైట్లీ మరణం దేశ రాజకీయాలకు తీరని లోటని తెలిపారు. జైట్లీ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గతేడాది అరుణ్ జైట్లీ కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు. అయితే కొంత కాలానికే జైట్లీకి అరుదైన కేన్సర్ వ్యాధి ఉన్నట్లు బయటపడింది. దీంతో ఆయన అమెరికాలో చికిత్స తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది.