తిరుమల బస్ టికెట్లపై అన్యమత ప్రచారం పట్ల స్వరూపానంద ఆగ్రహం
- బస్ టికెట్ల వెనుక హజ్, జెరూసలెం యాత్రల వివరాలు
- ఇది దుర్మార్గపు చర్య అంటూ స్వరూపానంద మండిపాటు
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జారీ చేసిన జీవోను జగన్ సర్కారు అమలు చేయాలంటూ సూచన
ఇది కుట్రగా భావిస్తున్నామని, దీనికి బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. హిందూ పుణ్యక్షేత్రాల పరిసరాల్లో అన్యమత ప్రచారాన్ని నిరోధించేలా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో ఓ జీవో తీసుకువచ్చారని, ఇప్పుడా జీవోను జగన్ సర్కారు తప్పకుండా అమలు జరిగేలా చూడాలని తెలిపారు. హిందువుల మనోభావాలు దెబ్బతినే చర్యలను ఉపేక్షించడం ప్రభుత్వానికి తగదని విశాఖ శారదా పీఠాధిపతి హితవు పలికారు.