Andhra Pradesh: ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డ బీజేపీ నేతలు!

  • ఏపీలో రద్దుల ప్రభుత్వం నడుస్తోంది
  • ప్రత్యామ్నాయం చూడకుండా ప్రతిదీ రద్దు తగదు
  • ఏపీలో దివాళకోరు దశ కనిపిస్తోంది

ఏపీలో రద్దుల ప్రభుత్వం నడుస్తోందని బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రత్యామ్నాయ వ్యవస్థను చూడకుండా ప్రతిదీ రద్దు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీలో గత నెలలో, ఈ నెలలో జీఎస్టీ చాలా దారుణంగా పడిపోయిందని, ఈ రెండు మాసాల్లో దివాళకోరు దశ కనిపిస్తోందని విమర్శించారు.

బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు విషయంలో రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఆ ప్రాజెక్టు టెండర్లు వాళ్ల నాయకులకు వచ్చేలా వైసీపీ ప్రభుత్వం చేస్తున్నదేమోనని అనుమానం వ్యక్తం చేశారు. రివర్స్ టెండరింగ్ వద్దని మంత్రులు, జాయింట్ సెక్రటరీలు చెప్పినా ప్రభుత్వం మాట వినలేదని అన్నారు. పోలవరం నిర్మాణం ఆలస్యమైతే రబీలో సాగునీటి కష్టాలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆశీస్సులతో రాష్ట్రానికి సంబంధించిన ఏ నిర్ణయమైనా సీఎం జగన్ తీసుకుంటున్నారన్న వ్యాఖ్యలపై మాధవ్ మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

More Telugu News