ఇక భారత్ లోనూ 'అమెజాన్ ఫ్రెష్'... ఆన్ లైన్ లో కూరగాయల అంగడి!
- ఆన్ లైన్ లో తాజా కూరగాయలు, పండ్లు, మాంసం
- రెండు గంటల్లోనే డెలివరీ
- బెంగళూరు నుంచి సేవలు మొదలు
'అమెజాన్ ఫ్రెష్' ఆన్ లైన్ దుకాణం 2007లో సియాటిల్ లో ప్రారంభమైంది. 'అమెజాన్ ఫ్రెష్' ద్వారా సేవలు అందుకోవాలంటే అమెజాన్ భారత వెబ్ సైట్ నుంచి గానీ, యాప్ నుంచి గానీ ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. 'అమెజాన్ ఫ్రెష్' ద్వారా 5,000 రకాల తాజా కూరగాయలు, పండ్లు, ఇతర ఉత్పత్తులు ఎంపిక చేసుకోవచ్చని అమెజాన్ వర్గాలు చెబుతున్నాయి. పర్సనల్ కేర్, హోమ్ కేర్ ఉపకరణాలు కూడా 'అమెజాన్ ఫ్రెష్' లో అందుబాటులో ఉంటాయి. మొదట బెంగళూరులో ప్రారంభం కానున్న ఈ సేవలను త్వరలోనే దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు.