బొత్స వ్యాఖ్యలు రాజధానిని అమరావతి నుంచి తరలిస్తారన్నట్టు ఉన్నాయి: వర్ల రామయ్య
- బొత్స ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారో అర్థం కావట్లేదు
- అవగాహన లేకుండా మాట్లాడారేమో!
- పనికిమాలిన నాయకుల వ్యాఖ్యలు పట్టించుకోవద్దు
బొత్స వ్యాఖ్యలు మాత్రం రాజధానిని అమరావతి నుంచి తరలిస్తారన్నట్టుగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అవగాహన లేకుండా, ఎటువంటి పర్యవసానాలు ఉంటాయో తెలియకుండా ఆయన మాట్లాడారో లేక ఆకతాయిగా మాట్లాడారో అని అన్నారు. ఏపీ రాజధాని అమరావతి అని ప్రజలందరికీ, ప్రపంచానికి తెలిసిన తర్వాత అవగాహనలేని వాళ్లు, పనికిమాలిన నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను పట్టించుకోవద్దని సూచించారు. ‘కనకపు సింహాసనంపై శునకంను కూర్చోబెట్టిన..’ అన్నది బొత్సకు బాగా వర్తిస్తుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.