KTR: సవాల్ విసిరే ముందు మీ నాన్న పర్మిషన్ తీసుకున్నారా?: కేటీఆర్ కు విజయశాంతి ప్రశ్న

షార్ట్స్‌లో చూడండి
ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో కేసీఆర్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా విమర్శించిన సంగతి తెలిసిందే. దీనిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ... దమ్ముంటే అవినీతిపై ఆధారాలు చూపించాలని సవాల్ విసిరారు. కేటీఆర్ సవాల్ పై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి సెటైర్లు వేశారు.

'కేటీఆర్ గారు, సవాల్ విసిరే ముందు మీ నాన్న కేసీఆర్ పర్మిషన్ తీసుకున్నారా?' అని విజయశాంతి అన్నారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో కూడా కేటీఆర్ ఇదే మాదిరి సవాల్ విసిరారని ఎద్దేవా చేశారు. మరోవైపు, ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదేశించిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
KTR
JP Nadda
KCR
BJP
TRS
Congress

More Telugu News