భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడం సాధ్యమే!: ఎన్ డీబీ అధ్యక్షుడు కె.వి.కామత్
- ఆటోమొబైల్ రంగంలో మందగమనం
- భారత్ తో పాటు అంతర్జాతీయంగానూ ఉంది
- చైనా అభివృద్ధి మనకూ సాధ్యమే
ఇన్ ఫ్రా, టెక్నాలజీ రంగాల్లో అభివృద్ధితో రాబోయే ఐదేళ్లలో 10 శాతం వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించడం సాధ్యమేనని చెప్పారు. గత 20 ఏళ్లలో చైనా నమోదుచేసిన ఆర్థిక వృద్ధి భారత్ కు కూడా సాధ్యమేనని కామత్ తెలిపారు.