సెలవులకు ఇంటికొచ్చిన బాలికను తల్లిని చేసిన తాతయ్య!
- జగిత్యాల పట్టణంలో ఘటన
- సెలవులకు ఇంటికి వచ్చిన బాలిక
- నాలుగో నెల గర్భవతని తేల్చిన వైద్యులు
- ఇంకా ఫిర్యాదు రాలేదంటున్న వైద్యులు
దీంతో భయపడిన ఆమె, ఎవరికీ విషయం చెప్పకుండానే హాస్టల్ కు వెళ్లిపోయింది. గత పదిహేను రోజులుగా ఆమె ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం, కడుపు నొప్పితో బాధపడుతూ ఉండటంతో, పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా, నాలుగు నెలల గర్భవతని వైద్యులు తేల్చారు. తల్లిదండ్రులు నిలదీయగా అసలు విషయాన్ని ఆమె చెప్పింది. దీంతో ఆ కుటుంబాల మధ్య గొడవ జరిగింది. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ సదరు వృద్ధుడు, అందరికన్నా ముందుగానే పోలీసులకు ఫిర్యాదు చేశాడని తెలుస్తుండగా, ఇంకా బాలిక తరఫు నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు అంటున్నారు.