రష్యాలో విమానాన్ని ఢీకొట్టిన పక్షుల గుంపు.. పొలంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.. వీడియో వైరల్!
- రష్యా రాజధాని మాస్కోలో ఘటన
- ఉరల్ ఎయిర్ లైన్స్ విమానానికి తప్పిన ముప్పు
- 23 మందికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు
ఈ విమానం క్రిమియాలోని సిమ్ ఫెరోపొల్ ప్రాంతానికి చేరుకోవాల్సి ఉంది. అయితే విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఓ పక్షుల గుంపు అనుకోకుండా విమానం ముందు భాగాన్ని ఢీకొట్టింది. ఈ సందర్భంగా కొన్ని పక్షులు విమానం ఇంజిన్లలోకి దూసుకెళ్లడంతో దాని నుంచి పొగలు రావడం మొదలైంది. దీంతో అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని సమీపంలోని ఓ పొలంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనలో ఐదుగురు చిన్నారులు సహా 23 మందికి గాయాలయ్యాయి. వీరిని అంబులెన్సుల్లో ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఓ ప్రయాణికుడు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.