Chiranjeevi: 'సైరా' నుంచి మేకింగ్ వీడియో రిలీజ్

షార్ట్స్‌లో చూడండి
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా 'సైరా' రూపొందింది. చరణ్ నిర్మించిన ఈ సినిమాకి పలువురు హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పనిచేశారు. వివిధ భాషలకి చెందిన నటీనటులు ఈ సినిమాలో నటించారు. అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా మేకింగ్ వీడియోను విడుదల చేశారు.

భారీ సెట్ల నిర్మాణం .. యుద్ధ సామాగ్రిని సిద్ధం చేసిన తీరు .. కాస్ట్యూమ్స్ ను డిజైన్ చేసిన విధానం .. ప్రధాన పాత్రధారులకి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ .. ఆంగ్లేయులపై నరసింహా రెడ్డి తిరుగుబాటు .. ఇరువర్గాలకి చెందిన పోరాట సన్నివేశాల చిత్రీకరణ జరిగిన తీరును మేకింగ్ వీడియోగా వదిలారు. చిత్రీకరణ ఏ స్థాయిలో జరిగిందనడానికి ఈ మేకింగ్ వీడియో అద్దం పడుతోంది. సినిమాపై మరింతగా ఆసక్తిని పెంచుతోంది. మెగా అభిమానులకు మరో కానుకగా ఈ నెల 20న టీజర్ ను వదలనున్నారు.
Go Back to Shorts
Chiranjeevi
nayanatara

More Telugu News