ఆఖరికి బక్రీద్ సందర్భంగా స్వీట్లు ఇస్తామన్నా తీసుకోని పాకిస్థాన్!
- ఆర్టికల్ 370ని రద్దు చేసిన భారత్
- ఉడికిపోతున్న పాకిస్థాన్
- దుందుడుకు నిర్ణయాలతో సంబంధాలు తెంచుకుంటున్న వైనం
ఇరుదేశాలు తమ సంస్కృతిని ప్రతిబింబించే పండుగలు, వేడుకలు నిర్వహించే సమయంలో మిఠాయిలు ఇచ్చిపుచ్చుకోవడం ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోంది. వాఘా-అటారీ సరిహద్దు వద్ద ఈ కార్యక్రమం ఓ ఉత్సవాన్ని తలపించే రీతిలో జరిగేది.
ఎప్పట్లానే బక్రీద్ సందర్భంగా మిఠాయిలు తీసుకువస్తున్నామంటూ బీఎస్ఎఫ్ అధికారులు పాక్ భద్రతా బలగాలకు సమాచారం అందించారు. అయితే, భారత్ నుంచి స్వీట్లు తీసుకోవాలా వద్దా అంటూ ఆ అధికారులు పాక్ ప్రభుత్వాన్ని కోరగా, "తీసుకోవద్దు, తిరస్కరించండి" అన్న సమాధానమే వచ్చింది. దాంతో భారత వర్గాలు నిరాశకు గురయ్యాయి.