గుంటూరు జిల్లాలో పల్టీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. పలువురికి గాయాలు!
- గుంటూరులోని రావులపురంలో ఘటన
- వినుకొండ నుంచి మాచర్ల వెళుతున్న బస్సు
- పక్కకు దిగడంతో అదుపు తప్పి పల్టీ
అయితే పక్కనున్న గ్రావెల్ మార్గం మెత్తగా ఉండటంతో ఓ వైపునకు ఒరిగిపోయి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి స్వల్పగాయాలు అయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని బాధితులను సమీప ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స పొందిన అనంతరం వీరిని విడుదల చేశారు.