కియా ప్రతినిధిని బెదిరించిన ఎంపీ మాధవ్ పై ఏం చర్యలు తీసుకున్నారు సీఎం గారూ?: వర్ల రామయ్య

  • కియా మెడలు వంచుతామంటూ ఎంపీ మాధవ్ వ్యాఖ్యలు
  • ఘాటుగా స్పందించిన టీడీపీ నేత వర్ల రామయ్య
  • పారిశ్రామికవేత్తలకు రక్షణ ఏదీ? అంటూ నిలదీసిన వైనం
కియా సంస్థ మెడలు వంచుతామంటూ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడం తెలిసిందే. దీనిపై టీడీపీ నేత వర్ల రామయ్య ఏపీ సీఎం జగన్ ను సూటిగా ప్రశ్నించారు. కియా ప్రతినిధులపై కేకలు వేసి బెదిరించిన ఎంపీ మాధవ్ పై ఏం చర్యలు తీసుకున్నారో సీఎం జవాబు చెప్పాలని నిలదీశారు. "మీరో పక్కన పెట్టుబడుల కోసం సమావేశాలు నిర్వహిస్తుంటే, మరోవైపు ఎంపీ మాధవ్ వీరంగం వేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని నమ్మి రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెడతారా? పారిశ్రామిక వేత్తలకు రక్షణ లేకుండా పోయింది. ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్ ఎటు పయనిస్తోంది?" అంటూ వర్ల రామయ్య ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు.
Go Back to Shorts
Telugudesam
Varla Ramaiah
KIA
Madhav
YSRCP
Jagan

More Telugu News