శ్రీనగర్ ఎయిర్ పోర్టులో సీతారాం ఏచూరికి చేదు అనుభవం
- శ్రీనగర్ ఎయిర్ పోర్టులో ఏచూరి, డి.రాజాలను అడ్డుకున్న అధికారులు
- నగరంలోకి అడుగుపెట్టనివ్వని వైనం
- సాయంత్రం ఢిల్లీకి వెనక్కి పంపే అవకాశం
ఈ సందర్భంగా మీడియాతో ఫోన్ లో ఏచూరి మాట్లాడుతూ, శ్రీనగర్ లోకి ప్రవేశం లేదంటూ లీగల్ ఆర్డర్ ను అధికారులు చూపించారని తెలిపారు. భద్రతా కారణాల వల్ల ఎస్కార్ట్ తో వెళ్లడానికి కూడా అనుమతించలేదని చెప్పారు. మరోవైపు, ఈ సాయంత్రం ఇద్దరు నేతలను మరో విమానంలో ఢిల్లీకి వెనక్కి పంపే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.