మా ప్రస్తావన మీకెందుకు?: పాకిస్థాన్‌పై మండిపడిన తాలిబన్లు
- కశ్మీర్ అంశాన్ని ఆప్ఘనిస్థాన్‌తో పోల్చడం అర్ధరహితం
- పాకిస్థాన్ విపక్ష నేత షెబాజ్ షరీఫ్‌పై ఆగ్రహం
- ఓ ప్రకటన విడుదల చేసిన ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆప్ఘనిస్థాన్ ప్రతినిధి
కశ్మీర్ సమస్య నేపథ్యంలో అసలు ఆప్ఘనిస్తాన్ పేరు ప్రస్తావించాల్సిన అవసరం ఏమొచ్చిందని తాలిబన్లు ప్రశ్నించారు. ఇతర దేశాల మధ్య పోటీకి ఆప్ఘనిస్థాన్ వేదిక అయ్యేందుకు సిద్ధంగా లేదని, అందువల్ల తమ ప్రస్తావన తేవొద్దని హితవు పలికింది.
‘కశ్మీర్ అంశంపై భారత్ నిర్ణయాలు, అక్కడి కశ్మీరీల పరిస్థితిపై విచారం వ్యక్తం చేస్తున్నాం. కశ్మీరీల హక్కులకు భంగం కలగకుండా దాయాది దేశాలు సంయమనం పాటించాలి. యుద్ధం వల్ల ఎదురయ్యే చేదు అనుభవాలను మేము చవిచూశాం కాబట్టి సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.