విధి రాతను నేను నమ్మను: హీరోయిన్ నిధి అగర్వాల్
- తొలి రెండు చిత్రాలు ఫ్లాప్
- 'ఇస్మార్ట్ శంకర్'తో పడిన హిట్
- సోషల్ మీడియాలో దూకుడు పెంచిన నిధి
ఈ సినిమా ఆమెకి భారీ విజయాన్ని అందించింది. దాంతో ఇప్పుడు ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో మరింత దూకుడు పెంచింది. తాజాగా తన హాట్ లుక్ ను పోస్ట్ చేస్తూ, 'విధి రాతను నేను నమ్మను .. గెలుపొందడం .. గమ్యం చేరుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది' అనే కామెంట్ పెట్టింది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగులో ఆమె జోరు పెరిగే అవకాశాలు ఎక్కువగానే వున్నాయనే అభిప్రాయాలు ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్నాయి.