వాహనదారులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సర్‌ప్రైజ్.. గిఫ్ట్‌గా సినిమా టికెట్లు!
- ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తున్న వారికి పోలీసుల అభినందన
- జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద సినిమా టికెట్ల పంపకం
- గతంతో పోలిస్తే వాహనదారుల్లో అవగాహన పెరిగిందన్న ఏసీపీ
జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద బుధవారం నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో వాహనదారులకు సినిమా టికెట్లు అందించి వారిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. పెండింగ్ చలాన్లు లేకుండా, ట్రాఫిక్ నియమాలను చక్కగా పాటిస్తున్న వాహనదారులను గుర్తించి టికెట్లు అందజేశారు. హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ విభాగం అదనపు కమిషనర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.
ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ.. వాహనదారుల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన గతంలో పోలిస్తే బాగా పెరిగిందన్నారు. గతంతో 30 శాతం మంది ద్విచక్ర వాహనదారులే హెల్మెట్ వాడేవారని, ఇప్పుడు 90 శాతం మంది వాడుతున్నారని తెలిపారు.