'కొబ్బరిమట్ట' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా మోహన్ బాబు
- హాస్యకథా చిత్రంగా 'కొబ్బరిమట్ట'
- మూడు విభిన్నమైన పాత్రల్లో సంపూ
- ఈ నెల 10వ తేదీన విడుదల
ఈ వేడుకకి ముఖ్య అతిథిగా మోహన్ బాబు రానున్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా సంపూ స్పందిస్తూ .. "నాలాంటి ఒక చిన్న నటుడు ఫంక్షన్ కి రమ్మని అడిగిన వెంటనే ఆశీర్వదించడానికి విచ్చేస్తున్న రియల్ పెదరాయుడు శ్రీ మోహన్ బాబు గారికి పాదాభివందనాలు" అంటూ ఒక స్పెషల్ పోస్టర్ ను వదిలాడు. ఈ సినిమాలో సంపూ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే.