Jagityala: ధర్మపురికి వరాల జల్లు కురిపించిన సీఎం కేసీఆర్

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలలో సీఎం కేసీఆర్ ఈ రోజు పర్యటించారు. మేడిగడ్డ, ఎల్లంపల్లి బ్యారేజ్ ని పరిశీలించారు. జగిత్యాల జిల్లా, ధర్మపురిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం లక్ష్మీనరసింహస్వామిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ, ధర్మపురి మునిసిపాలిటీ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు. ధర్మపురి నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీకి రూ.10 లక్షల నిధులు, ప్రతి మండల కేంద్రానికి రూ.25 లక్షల ప్రత్యేక నిధులు మంజూరు చేయనున్నట్టు ప్రకటించారు. ధర్మపురి క్షేత్రం భవిష్యత్ లో గొప్ప ధార్మిక క్షేత్రంగా భాసిల్లుతుందని, స్వామి వారి పాదాల చెంత గోదావరి నది సజీవంగా ఉంటుందని అన్నారు. 
Go Back to Shorts
Jagityala
Dharmapuri
cm
kcr

More Telugu News