Godavari: పోలవరం వద్ద గోదావరి ఉగ్రరూపం.. రెండు లాంచీలు గల్లంతు
భారీగా కురుస్తున్న వర్షాలతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. సముద్రాన్ని తలపించే రీతిలో గోదావరిలో నీరు ప్రవహిస్తోంది. ఎన్నో గ్రామాలు వరద ముంపుకు గురయ్యాయి. తాజాగా, పోలవరం ప్రాజెక్టు వద్ద రెండు లాంచీలు గల్లంతయ్యాయి. రాత్రి ఈ రెండు లాంచీలకు లంగరు వేసి, నిలిపి ఉంచారు. ఈ రెండు లాంచీలు మునిగిపోవడం కానీ లేదా కొట్టుకు పోవడం కానీ జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే, లాంచీలలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టైంది.