బిగ్‌బాస్-3: ఎలిమినేషన్ లో జాఫర్ బయటికి
- ఓట్లు తక్కువగా రావడంతో ఎలిమినేట్ అయిన జాఫర్
- హౌస్‌లోకి వచ్చాక తన అభిప్రాయం మారిందన్న యాంకర్
- మరోసారి అవకాశం వస్తే వెళ్తానన్న జాఫర్
బిగ్‌బాస్ హౌస్‌లో గ్రూపులు ఉంటాయని చెప్పిన జాఫర్.. మళ్లీ హౌస్‌లోకి వెళ్లే అవకాశం వస్తే వెళ్తారా? అన్న నాగార్జున ప్రశ్నకు వెళ్తానని సమాధానం ఇచ్చాడు. హౌస్ నుంచి బయటకు వచ్చాక నాగార్జునతో కలిసి వేదికపై మాట్లాడిన జాఫర్ బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన రెండు రోజుల వరకు ఇదంతా స్క్రిప్టు ప్రకారం జరుగుతోందని భావించానన్నాడు. అయితే, ఆ తర్వాత తన అభిప్రాయం నిజం కాదని తెలిసిందన్నాడు.