India: నీలిరంగులో మెరిసిపోతున్న భూమి.. చంద్రయాన్-2 తీసిన ఫొటోలు విడుదల!

  • ఫొటోలు తీసిన ఎల్ఐ4 కెమెరా
  • రోవర్, ల్యాండర్, ఆర్బిటర్ ను పంపిన ఇస్రో
  • ఈ నెల 14న చంద్రుడివైపు దూసుకుపోనున్న వాహకనౌక

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఇటీవల చంద్రయాన్-2ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. చంద్రుడి దక్షిణ ధ్రువంవైపు ప్రయోగాలు చేపట్టేందుకు వీలుగా ఇందులో ల్యాండర్, రోవర్, ఆర్బిటర్ లను ఇస్రో పంపింది. ప్రస్తుతం భూమి చుట్టూ కక్ష్యను పెంచుకుంటూ పరిభ్రమిస్తున్న చంద్రయాన్-2 వాహక నౌక ఆగస్టు 14న భూ కక్ష్యను దాటి చంద్రుడివైపు దూసుకుపోనుంది. ఈ నేపథ్యంలో చంద్రయాన్-2లోని ఎల్ఐ4 కెమెరా తీసిన భూగ్రహం ఫొటోలను ఇస్రో ఈరోజు విడుదల చేసింది. ఈ ఫొటోల్లో భూమి నీలం రంగులో మెరిసిపోతోంది. వీటిని మీరూ చూసేయండి.

More Telugu News