హైదరాబాద్ లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బీభత్సం.. 15 మందికి గాయాలు!
- నగరంలోని బహదూర్ పురా వద్ద ఘటన
- నియంత్రణ కోల్పోయి అదుపు తప్పిన బస్సు
- ధ్వంసమైన బస్సు అద్దాలు.. పలువురికి గాయాలు
ఈ ఘటనలో బస్సు అద్దాలు ధ్వంసం కాగా, వాహనంలోని 15 మంది ప్రయాణికులకు స్వల్పగాయాలు అయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే క్షతగాత్రులను అంబులెన్సుల్లో సమీప ఆసుపత్రికి తరలించారు. మరోవైపు డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడపడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని కొందరు ప్రయాణికులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు, డ్రైవర్ ను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.