జాదవ్‌తో భారత్ అధికారుల భేటీ విషయంలో పాకిస్థాన్ కొత్త కండిషన్
- తమ అధికారి కూడా ఉంటాడని వెల్లడి
- భేటీ మొత్తాన్ని వీడియో తీస్తామని స్పష్టీకరణ
- నిబంధనలకు విరుద్ధమంటున్న భారత్ అధికారులు
భారత్ అధికారులతోపాటు తమ అధికారి కూడా ఒకరు ఉంటారని స్పష్టం చేసింది. అలాగే సీసీ కెమెరాల నిఘాలోనే అధికారులు భేటీ కావాలని స్పష్టం చేసింది. ఈ వాదనపై భారత్ ఆశ్చర్యం, అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వియన్నా ఒప్పందం ప్రకారం ఇతర దేశాల్లో బందీలుగా ఉన్న వ్యక్తులను వారి దేశాలకు చెందిన అధికారులు ఏ ఆటంకం లేకుండా కలుసుకోవచ్చన్న విషయాన్ని పాకిస్థాన్‌కు గుర్తు చేశారు. దీనిపై అక్కడి అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.