యూఏపీఏ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- రాజ్యసభలో యూఏపీఏ బిల్లుపై తీవ్ర స్థాయిలో చర్చ
- ఈ బిల్లుకు అనుకూలంగా 147 ఓట్లు
- వ్యతిరేకంగా 42 ఓట్లు
భిన్న ధోరణి వల్లే ఈ సవరణను వ్యతిరేకిస్తున్నా: చిదంబరం
ఈ బిల్లుపై చర్చ సమయంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడీ చర్చ జరిగింది. ఈ బిల్లు కారణంగా మామూలు వ్యక్తులపై ఉగ్రవాదులన్న ముద్ర పడే ప్రమాదం ఉందని కాంగ్రెస్ నేత చిదంబరం అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ బిల్లుకు సవరణ మాత్రమే తెస్తున్నాం: అమిత్ షా
ఈ వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందిస్తూ, ఈ బిల్లుకు సవరణ మాత్రమే తెస్తున్నామని, చట్టం చేయడం లేదని స్పష్టం చేశారు. మానవత్వానికి వ్యతిరేకంగా మెలిగే వాళ్లే ఉగ్రవాదులని, సంస్కరణలను ఏ విధంగా చేస్తామో, అలాగే ఉగ్రవాదుల విషయంలో మరో ముందడుగు వేస్తామని చెప్పారు.