'ఐసిస్'లో చేరిన కేరళ యువకుడి మృతి?
- 2017లో ఇంటి నుంచి పారిపోయిన ముహాసిన్
- అల్లా సేవలో అమరుడయ్యాడు
- చనిపోయాడంటూ వాట్స్ యాప్ మెసేజ్
ఈ విషయాన్ని పోలీసులకు చెబితే, మీకే ప్రమాదమని కూడా మెసేజ్ పంపిన వ్యక్తి హెచ్చరికలు జారీ చేశాడు. మృతదేహం ఫోటోను కూడా పంపించాడు. మెసేజ్ గురించిన సమాచారాన్ని పోలీసులకు అందించిన ముహాసిన్ తల్లిదండ్రులు, సోదరుడు శోకసంద్రంలో మునిగిపోయారు. ముహాసిన్ తో పాటు కేరళకు చెందిన మరో వ్యక్తి కూడా ఉగ్రవాదుల్లో చేరాడని, అయితే, ఈ మెసేజ్ ని ఎవరు పంపించారన్న విషయం తేలాల్సి వుందని పోలీసు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.