బాలీవుడ్ హీరోతో డేటింగ్ చేస్తున్న కైరా అద్వానీ?
- సిద్ధార్థ్ మల్హోత్రాతో కైరా డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు
- నిన్న 27వ పుట్టిన రోజు జరుపుకున్న కైరా
- సిద్దార్థ్ తో కలసి వెళ్లిపోయిన ముద్దుగుమ్మ
నిన్న కైరా తన 27వ పుట్టినరోజును జరుపుకుంది. తన బర్త్ డేను పురస్కరించుకుని నిన్న రాత్రి ముంబైలో తన స్నేహితులకు పార్టీ ఇచ్చింది. ఈ పార్టీకి హీరో షాహిద్ కపూర్ హాజరయ్యాడు. పార్టీ అనంతరం సిద్ధార్థ్ తో కలసి కైరా వెళ్లిపోవడం... అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాదు, ఇద్దరూ కలసి కెమెరాలకు పోజులు కూడా ఇచ్చారు. దీంతో, ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారనే వార్తలు మరింత ఎక్కువయ్యాయి.