Pawan Kalyan: మీడియా సంస్థలతో గొడవను పరిష్కరించుకునే దిశగా జనసేనాని
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో జనసేన ఓటమికి మీడియానే కారణమని భావిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మీడియా సంస్థలతో తనకున్న గొడవలను పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అతి విశ్వాసమే తమ కొంప ముంచిందని, జనంలోకి వెళ్లకపోవడమే పార్టీ ఓటమికి ప్రధాన కారణమని పవన్ భావిస్తున్నారు. దీంతో ఇకపై నిత్యం ప్రజల్లోనే ఉండాలని నిర్ణయించారు.
ఎన్నికల సమయంలో జనసేనకు మీడియాలో అనుకున్నంత కవరేజీ రాలేదని పార్టీ నేతలతో పవన్ చెప్పుకొచ్చారు. ఎన్నికలకు ముందు ప్రధాన మీడియా చానళ్లతో గొడవలే తమ పుట్టి ముంచాయని పవన్ భావిస్తున్నారు. ఎన్నికలకు ముందు మీడియాపై యుద్ధం ప్రకటించిన పవన్ ఆ చానళ్లను బాయ్‌కాట్ చేయాలని అభిమానులకు పిలుపునిచ్చారు. మీడియాకు తాను దూరం కావడానికి ఇదే కారణమని తెలుసుకున్న పవన్ ఇకపై మీడియాతో సఖ్యతగా ఉండాలని నిర్ణయానికి వచ్చారు. అన్ని చానళ్ల కార్యాలయాలకు వెళ్లి యాజమాన్యాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకునేందుకు పవన్ ప్రత్యేకంగా ఓ బృందాన్ని నియమించారు.