వార్షిక వేతనంలో సరికొత్త రికార్డు... వారణాసి ఐఐటీ టెక్కీకి రూ. 1.52 కోట్ల ఆఫర్!
- నూతన నియామకాల వెల్లువ
- నిట్, ఐఐటీ విద్యార్థులకు భారీ ఆఫర్లు
- ఉద్యోగాలు ఇచ్చేందుకు పోటీ పడ్డ కంపెనీలు
కాగా, ఈ సంవత్సరం నిట్ న్యూఢిల్లీ (నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లోనూ విద్యార్థులు మంచి ఆఫర్లను దక్కించుకున్నారు. మెకెన్సీ, జబాంగ్, రిలయన్స్, జనరల్ మోటార్స్, ఈబే వంటి కంపెనీలు ముందస్తు నియామకాలు చేపట్టగా, ఓ విద్యార్థికి అత్యధికంగా రూ. 1.24 కోట్ల వేతన ఆఫర్ లభించింది. దక్షిణాది నిట్ లలో తిరుచిరాపల్లి నిట్ పాత రికార్డులను బద్దలు కొట్టింది. ఓ విద్యార్థికి రూ. 89.5 లక్షల ఆఫర్ లభించింది. అలహాబాద్ నిట్ లో 55 మందికి రూ. 25.50 లక్షల వేతనంతో ఉద్యోగాలను ఎల్అండ్ టీ, ఏబీబీ, హీరో, బ్లూ స్టార్ వంటి కంపెనీలు ఆఫర్ చేశాయి.