కర్ణాటక అసెంబ్లీకి కొత్త స్పీకర్... నామినేషన్ వేసిన బీజేపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ హెగ్డే కగేరి

  • కర్ణాటకలో ముగిసిన రాజకీయ సంక్షోభం
  • అధికార పీఠంపై బీజేపీ
  • కొత్త స్పీకర్ ఎన్నికపై రేపు ప్రకటన
గత కొన్నిరోజులుగా అనేక మలుపులు తిరుగుతూ ఉత్కంఠ రేపిన కర్ణాటక రాజకీయ సంక్షోభం ముగిసింది. కుమారస్వామి సర్కారు పడిపోవడం, ఆపై యడియూరప్ప నాయకత్వంలో బీజేపీ అధికార పీఠాన్ని అధిష్ఠించడం తెలిసిందే. అయితే స్పీకర్ గా రమేశ్ కుమార్ రాజీనామా చేసిన నేపథ్యంలో, కర్ణాటక అసెంబ్లీ కొత్త స్పీకర్ గా బీజేపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ హెగ్డే కగేరి పేరు దాదాపుగా ఖరారైంది. కగేరి గతంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించారు. అంకోలా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కగేరి 6 పర్యాయాలు వరుస విజయాలు అందుకున్నారు.

కాగా, స్పీకర్ పదవి కోసం ఆయన తన నామినేషన్ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. స్పీకర్ పదవికి మరెవ్వరూ నామినేషన్ వేయకపోవడంతో కగేరి ఎన్నిక లాంఛనం కానుంది. స్పీకర్ ఎన్నిక అంశాన్ని రేపు అధికారికంగా ప్రకటించనున్నారు.
Go Back to Shorts
Karnataka
Speaker
BJP

More Telugu News