మాదాపూర్‌లో ట్రాఫిక్ సీఐపై వైసీపీ ఎమ్మెల్యే ఉదయభాను కుమారుడు పిడిగుద్దులు.. అరెస్ట్
- కారును ఆపడంతో రెచ్చిపోయిన ప్రసాద్
- సీఐతో వాగ్వివాదం
- చేయి చేసుకోవడంతో పోలీసుపై పిడిగుద్దులు
దీంతో కారు దిగిన ఆయన పోలీసులతో వాగ్వివాదానికి దిగాడు. అది చూసి వెళ్లిన ట్రాఫిక్ సీఐ రాజగోపాల్ రెడ్డితోనూ ప్రసాద్ పౌరుషంగా మాట్లాడాడు. దీంతో సీఐ ఆయనపై చేయి చేసుకున్నాడు. ఈ ఘటనతో మరింత రెచ్చిపోయిన ప్రసాద్ సీఐపై పిడిగుద్దులు కురిపించాడు. సీఐ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు.