Bhavana: అలాంటి పరిస్థితి ఇంతవరకూ రాలేదు: నటి భావన

షార్ట్స్‌లో చూడండి
సినిమాల్లో నటించినప్పటికీ, ఆ తరువాత సీరియల్స్ లో భావన బిజీ అయింది. సీరియల్స్ వైపు దృష్టి పెట్టిన భావన, చాలా తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి భావన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. " ప్రస్తుతం ఒక వైపున సీరియల్స్ .. మరో వైపున వెబ్ సిరీస్ చేస్తూ తీరిక లేకుండా వున్నాను. మరో వైపున ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను చూసుకుంటున్నాను.

నటిగా నా కెరియర్ ను మొదలుపెట్టి చాలా కాలమే అయింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఖాళీగా ఉండవలసిన పరిస్థితి రాలేదు. అలా అని చెప్పి, నేను ఎప్పుడూ ఎవరినీ అవకాశాలు ఇవ్వమని అడగలేదు. నాకు వస్తున్న అవకాశాలను చేసుకుంటూ వెళుతున్నాను. అవకాశాలు పూర్తిగా రావడం మానేసిన రోజున ఇంటిపట్టునే ఉండిపోతాను" అని చెప్పుకొచ్చింది.
Go Back to Shorts
Bhavana

More Telugu News