Tiktok: పోలీస్ వాహనంలో ఒకరు.. బానెట్‌పై కూర్చొని మరొకరు టిక్‌టాక్ చేసి సస్పెండ్ అయిన కానిస్టేబుళ్లు!

షార్ట్స్‌లో చూడండి
టిక్‌టాక్ పిచ్చికి మరో ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్ అయ్యారు. ఉద్యోగాల నుంచి ఎందరో ప్రభుత్వోద్యోగులు సస్పెండ్ అవుతున్నా కూడా, విధుల్లో ఉంటూనే టిక్‌టాక్ చేస్తూ అడ్డంగా బుక్ అవుతున్నారు. ఈ ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నా కూడా ప్రభుత్వోద్యోగులు టిక్‌టాక్ చేయడం మాత్రం మానట్లేదు.

ఇప్పటికే గుజరాత్‌లో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు టిక్‌టాక్ కారణంగా సస్పెండ్ అవగా, నేడు మరో ఇద్దరు సస్పెండ్ అయ్యారు. రాజ్‌కోట్‌కు చెందిన అమిత్, నీలేశ్ అనే కానిస్టేబుళ్లు విధి నిర్వహణలో ఉండగా టిక్‌టాక్ చేశారు. సినిమాల్లో హీరోల్లా పోలీస్ వాహనం నడుపుతూ ఓ కానిస్టేబుల్,  మరొకరు బానెట్‌పై కూర్చొని టిక్‌టాక్ చేశారు. వీరి టిక్‌టాక్ వీడియో తెగ వైరల్ అయింది. అది కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వాళ్లను సస్పెండ్ చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.
Go Back to Shorts
Tiktok
Gujarath
Constables
Police Vehicle
Suspend

More Telugu News