తొలి 3D పౌరాణిక చిత్రంగా 'కురుక్షేత్రం'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తొలి 3D పౌరాణిక చిత్రంగా 'కురుక్షేత్రం'

  • తమిళంలో భారీ పౌరాణిక చిత్రం
  •  తెలుగు టైటిల్ గా 'కురుక్షేత్రం' 
  • ద్రౌపదిగా కనిపించనున్న స్నేహ        
తమిళంలో భారీ పౌరాణిక చిత్రం నిర్మితమవుతోంది. సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ సినిమాకి 'కురుక్షేత్రం' అనే టైటిల్ ను ఖరారు చేశారు. 3D వెర్షన్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న మొదటి పౌరాణిక చిత్రం ఇది. అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించిన మునిరత్నమే వెండితెరకి తగిన విధంగా కథను అందించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. కౌరవ పాండవుల మధ్య ఎత్తులు .. పై ఎత్తులతో .. కురుక్షేత్ర యుద్ధ వ్యూహాలతో ఈ ట్రైలర్ కొనసాగింది. భీష్ముడిగా అంబరీష్ .. అర్జునుడిగా సోనూ సూద్ .. ధర్మరాజుగా శశికుమార్ .. దుర్యోధనుడిగా దర్శన్ .. కర్ణుడిగా అర్జున్ .. కృష్ణుడిగా రవిచంద్రన్ .. 'శల్య'గా రాక్ లైన్ వెంకటేశ్ ..  అభిమన్యుడిగా నిఖిల్ .. శకునిగా రవిశంకర్ .. ద్రౌపదిగా స్నేహ నటించారు.
Arjun
darshan
Sneha

More Telugu News