‘డియర్ కామ్రేడ్’ చిత్రం ఒక అద్భుతమైన, పవర్‌ఫుల్ ప్రేమకథ: కరణ్ జోహార్
- జస్టిస్ ప్రభాకరణ్ అందించిన సంగీతం అద్భుతం
- విజయ్ దేవరకొండ బ్రిలియంట్
- నటీనటులందరి నటన అత్యుత్తమం
- హిందీలో రీమేక్ చేయబోతున్నా
ఈ చిత్రాన్ని తాను హిందీలో రీమేక్ చేయబోతున్నట్టు వెల్లడించారు. ‘డియర్ కామ్రేడ్’ ఒక అద్భుతమైన, పవర్‌ఫుల్ ప్రేమకథా చిత్రమని కరణ్ కితాబిచ్చారు. ఈ చిత్రానికి జస్టిస్ ప్రభాకరణ్ అందించిన సంగీతం మరో అద్భుతమన్నారు. విజయ్ దేవరకొండ బ్రిలియంట్ అని, రష్మిక చాలా బాగా నటించిందని, నటీనటులందరి నటన అత్యుత్తమమని అన్నారు. ధర్మా ప్రొడక్షన్స్ సంస్థ ఈ అందమైన ప్రేమకథను రీమేక్ చేయబోతోందని కరణ్ జోహార్ ట్వీట్‌లో వెల్లడించారు.