ఉత్తరప్రదేశ్ లో దారుణం.. ఆఫీసులో చొరబడి బీజేపీ నేత కాల్చివేత!
- యూపీలోని ఘజియాబాద్ జిల్లాలో అరాచకం
- కాల్పుల అనంతరం పరారైన దుండగులు
- నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు
ఆ తర్వాత బైక్ ను అక్కడే వదిలి పారిపోయారు. కాల్పుల శబ్దం విన్న సిబ్బంది రక్తపు మడుగులో పడిపోయిన తోమర్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో తోమర్ హత్యపై కేసు నమోదుచేసిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు గాలింపును ముమ్మరం చేశారు.