Nikita: ఏపీ క్యాడర్ ఐపీఎస్ నిఖిత... తెలంగాణకు బదిలీ!

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌ కు చెందిన ఐపీఎస్‌ అధికారిణి నిఖితా పంత్‌ ను తెలంగాణకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2017 బ్యాచ్‌ కు చెందిన ఆమె తెలంగాణ క్యాడర్ కు చెందిన అదే సంవత్సరం బ్యాచ్ ఐపీఎస్ అధికారి రాజర్షి షాను వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో, అంతర్రాష్ట బదిలీ నిబంధనల కింద ఆమెను తెలంగాణకు బదిలీ చేస్తూ కేంద్ర హోమ్ శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఐపీఎస్‌ నిబంధనలు - 1954 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నామని హోమ్ శాఖ అధికారులు వెల్లడించారు. కాగా, సర్వీసెస్ విభాగాల్లో పని చేస్తున్న వారు వివాహం చేసుకుంటే, ఇద్దరినీ ఒకే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న నిబంధనలు ఉన్న విషయం తెలిసిందే. 
Go Back to Shorts
Nikita
Rajarshi
IPS
Transfer

More Telugu News